ఉరేసుకుని నవవధువు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని నవవధువు ఆత్మహత్య

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

చారకొండ: పైళ్లె నెల కూ డా గడవక ముందే వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన చారకొండ మండలంలోని తుర్కలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వీరబాబు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 20న తాడూరు మండలంలోని సిర్సనవాడకు చెందిన అశ్వినికి తుర్కలపల్లికి చెందిన గంటె అశోక్‌తో వివాహం చేశారు. ఈ నెల 7న అశ్విని తల్లిగారింటికి వెళ్లడంతో అశోక్‌ 11న తిరిగి తుర్క లపల్లి తీసుకొచ్చాడు. మంగళవారం అశ్విని ఫోన్‌పేలో స్నేహితుడికి రూ.వేయి పంపి, స్క్రీన్‌షార్ట్‌ పెట్టడంతో గమనించిన భర్త అశోక్‌ ఎవరికి డబ్బులు పంపించావు అని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో మనస్థాపానికి గురై బాత్రురూంలోకి వెళ్లి పైన గొట్టానికి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించి భర్త, కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూసేసరికి అప్పటికే విగతజీవిగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఎదుల రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.

విద్యుదాఘాతంతో

నెమలి మృతి

మదనాపురం: ఆ ఆలయ ప్రాంగణం నిత్యం భక్తుల రాకతో.. ఆ నెమలి అందమైన ఆటపాటలతో ఆహ్లాదకరంగా ఉండేది. ఒక్కసారిగా జరిగిన ఒక ఘోర ప్రమాదం ఆలయ పరిసరాల్లో తీవ్ర నిశ్శబ్ధాన్ని, విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలి నెమలి ప్రాణాలు కోల్పోయిన ఘటన మదనాపురం మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం చోటచేసుకుంది. స్థానిక ఆంజనేయస్వా మి ఆలయ పరిసరాల్లో రోజూలాగే ప్రాంగణంలో సంచరిస్తూ, ఒక్కసారిగా పైకి ఎగిరింది. అక్కడ వేలాడుతున్న విద్యుత్‌ తీగలు నెలమలికి శాపంగా మారాయి. తీగలు తగిలి విద్యుత్‌ షాక్‌ కు గురై జాతీయ పక్షి ఒక్కసారిగా ఆల యం ముందు నేలకూలింది. నెమలి కిందపడి పోవడాన్ని గమనించిన స్థానిక యువకులు తల్లడిల్లిపోయారు. ఎలాగైనా బతికించుకోవాలనే ఆరాటంతో పరుగెత్తుకుంటూ వెళ్లినా అప్ప టికే ఆ మూగజీవం అనంత వాయువుల్లో కలిసిపో యింది. ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ ఐ హరిచంద్ర గౌడ్‌ త్వరితగతిన ఘటనా స్థలా నికి చేరుకుని అటవీశాఖ అధికారుల వివరించారు.

అదృశ్యమైన వ్యక్తి

బలవన్మరణం

పాన్‌గల్‌: అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్య చేసుకొ ని శవమై కనిపించిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కుర్మ య్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో ని చిక్కేపల్లికి చెందిన పికిలి రమేష్‌ (32) అదృశ్యమైన ఘటనపై సోమవారం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రమేష్‌ గ్రా మ శివారులోని తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంగళవారం ఘటన స్థలానికి వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనారోగ్య కారణాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి బొజ్జయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

తల్లీ, కుమార్తె అదృశ్యం

బల్మూర్‌: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన వరలక్ష్మి తన మూడేళ్ల కుమార్తె భార్గవితో కలిసి అదృశ్యమైన ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు.. మైలారం గ్రామానికి చెందిన పోతుల వరలక్ష్మి, చంద్రయ్య భార్యభర్తలు. వీరికి మూడేళ్ల కుమార్తె భార్గవి ఉంది. చంద్రయ్య అనారోగ్యంతో బాధపడుతూ.. ఆస్పత్రిలో చూయించుకోవడానికి ఈ నెల 11 భార్యను డబ్బులు అడగగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వరలక్మి తన కుమార్తెను తీసుకొని ఇంటి నుంచి వెళ్లి, తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లు, చుట్టుపక్కల వెతికినా సమాచారం లభించకపోవడంతో చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో రజత పతకం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హైదరాబాద్‌లో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారు డు ఎం.శివ మెరుగైన ప్ర తిభ కనబరిచాడు. ఈ పోటీల్లో అండర్‌–14 విభాగం‘సి’ గ్రూప్‌ ట్రైథ్లాన్‌ ఈ వెంట్‌ (60 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, 600 మీటర్ల పరుగు)లో రజతపతకం సాధించి సత్తా చాటాడు. జిల్లా క్రీడాకారుడిని జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర, సభ్యులు, పీడీలు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement