
నాలుగు స్టేషన్‌లకు ఏబీఎస్‌ఎస్ నిధులు
రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించడానికి భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడానికి భారతీయ రైల్వేలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్‌కు రూ.35.54 కోట్లు, గద్వాల స్టేషన్‌కు రూ.34.29 కోట్లు, బాలబ్రహ్మేశ్వర జోగుళాంబస్టేషన్‌కు రూ.6.07 కోట్లతో ఏబీఎస్‌ఎస్ పనులు జరుగుతున్నాయి. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్‌పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి.