
చికిత్స పొందుతూ యువకుడి మృతి
● ఆరు నెలల క్రితం ఆత్మహత్యాయత్నం
● పోక్సో కేసులో వేధింపులతోనే
అంటున్న బంధువులు
అచ్చంపేట రూరల్: ఓ కేసులో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని సిద్ధాపూర్‌కు చెందిన పాల్వాయి హరీష్ (22)పై 8 నెలల క్రితం పోక్సో కేసు నమోదైంది. రిమాండ్‌కు తరలించగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. హరీష్‌ను యువతి బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మనస్థాపానికి గురైన హరీష్ మార్చి నెలలో వీడియో తీసుకుంటూ తన చావుకు కారకుల పేర్లు చెబుతూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల పాటు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. హరీష్ మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు సిద్ధాపూర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. కేసు నమోదు చేయడంతో ఆందోళన విరమించారు.
చేపల వేటకు
వెళ్లి వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్ర మాదవశాత్తు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాంలాల్‌నాయక్ కథనం ప్రకారం.. చిన్నచింతకుంట కు చెందిన సంఘమోని రాము(41) ఆదివారం గ్రామ సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్‌డ్యాంలో చేపల వేటకు వెళ్లి వల వేశాడు. అయితే వలను తీసే సమయంలో ప్రమాదవశాత్తు వల చుట్టుకొని చెక్‌డ్యాంలో మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై రాము భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాముకు భార్యతోపాటు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
చోరీ కేసులో రిమాండ్
● 7 తులాల బంగారం,
70 తులాల వెండి స్వాధీనం
బిజినేపల్లి: మండలంలోని పాలెం గ్రామానికి చెందిన బత్తుల మల్లయ్య నుంచి దొంగతనం కేసులో 7 తులాల బంగారం, 70 తులాల వెండి, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అశోక్‌రెడ్డి ఆదివారం విలేకర్లకు తెలిపారు. ఏడాది కా లంగా దొంగతనాల కు అలవాటు పడిన మల్ల య్య 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. బాఽ దితుల ఫిర్యాదు మేరకు విచారణలో బత్తుల మల్లయ్య పై అనుమానంతో విచారించగ చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడన్నా రు. ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి