
సరైన సమయంలో ఇవ్వాలి..
మా చెరువులు నిండి 20 రోజులు కావస్తున్నా.. ఉచిత చేప విత్తనాలు ఇవ్వలేదు. ఆలస్యంగా ఇస్తే లాభం లేదు. గతేడాది ప్రభుత్వం ఇచ్చే చేప విత్తనాలను నమ్ముకొని తీవ్రంగా నష్టపోయాం. నాణ్యత లేకపోవడంతో చేపల సైజు పెరగలేదు. సరైన సమయంలో చేప విత్తనాలు నాణ్యతతో ఇస్తే మత్స్యకారులకు మేలు జరుగుతుంది. లేదంటే ప్రభుత్వం నుంచి మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలకు నగదు బదిలీ అయినా చేస్తే సంఘాల ద్వారా కొనుగోలు చేస్తాం. – చింతకాయల లక్ష్మయ్య,
కొత్త మొల్గర మత్స్యపారిశ్రామిక సంఘకార సంఘం అధ్యక్షుడు