
భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాకేంద్రంలోని టీచర్స్‌కాలనీ పార్క్ ఆవరణలో ఉన్న వినాయక ఆలయం దగ్గర ఓరసిద్ధి వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో 2018 నుంచి మట్టి గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా 9 రోజులు పూర్తిగా కోలాటం, భజనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పుతాం. ప్రత్యేకంగా మహిళలు చేసే కోలాటం, భజనలు ఆకట్టుకుంటాయి. దర్శనం కోసం వచ్చే భక్తులకు సైతం మట్టి గణనాథుడిపై అవగాహన కల్పిస్తాం.
– మహేందర్, ఓరసిద్ధి వినాయక
సేవా సంఘం సభ్యుడు, టీచర్స్‌కాలనీ