
పీయూ భూమిని కాపాడాలి
పీయూలో సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం 500 గజాల భూమికి అధికారులు అనుమతిస్తే విద్యుత్ శాఖ ఏకంగా ఎకరంన్నర భూమిని చదును చేశారు. ప్రస్తుత అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. గత అధికారులు యూనివర్సిటీకి భూమిని సమకూర్చితే ప్రస్తుత అధికారులు ఉన్న భూమిని కాపాడలేకపోతున్నారు. భూమిని తిరిగి స్వాధీనం చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
– వేణు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
పీయూలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఒక ఎకరా భూమిని కేటాయించారు. అందులో భాగంగానే ఇక్కడ భూమిని చదును చేశాం. ఎకరం కంటే ఎక్కువ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోం.
– సుదీర్‌రెడ్డి, ఈఈ, ట్రాన్స్‌కో
పీయూలో సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్‌శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు కేవలం 500 గజాల భూమిని మాత్రమే కేటాయించాం. వారు ఎక్కువ భూమిని చదును చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సదరు డిపార్ట్‌మెంట్ వారికి లేఖ సైతం రాశాం. ఎక్కువ భూమిని వినియోగించుకోవడానికి అవకాశం లేదు.
– శ్రీనివాస్, పీయూ వైస్‌చాన్స్‌లర్
●

పీయూ భూమిని కాపాడాలి