
స్వశక్తితో ముందుకు సాగాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మహిళలు స్వశక్తితో ముందుకు సాగాలని అప్పుడే ఆర్థికంగా బలోపేతం అవుతారని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఇటీవల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ద్వారా మహిళా సంఘాలకు చెందిన మహిళలు బేకరీ రంగంలో శిక్షణ పొందిన వారికి సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. శిక్షణలో బేకరీ వస్తువులైన బిస్కెట్లు, కేకులు తదితర 16 రకాల వాటిలో శిక్షణ పొందారు. వారు తయారు చేసిన కేక్‌ను కలెక్టర్ కట్ చేసి అధికారులకు అందించారు. మహిళలు చిన్న షాపులు, వ్యాపారాలు, చేసేవారు బేకరీ పదార్థాల తయారీలో పొందిన శిక్షణ తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, ఫేషియల్ రికగ్నిషనల్ యాప్ ద్వారా అందజేస్తున్నారు. ఫంక్షన్ ద్వారా యాప్‌లో క్యాప్చర్ చేసేందుకు ప్రభుత్వం సమకూర్చిన శాంసంగ్ మొబైల్ ఫోన్లు 167 ఫింగర్ క్యాప్చర్ మంత్ర డివైస్‌లు కలెక్టర్ బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు అందజేశారు.
ప్రజావాణికి 86 ఫిర్యాదులు..
సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 86 ఫిర్యాదులను కలెక్టర్ అందకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఆర్‌డీఓ నర్సింహులు, ఏపీడీ శారద, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.