
హైదరాబాద్: జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)లో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయాలని ఎన్‌జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయొద్దని ఎన్‌జీటీ తన తాజా ఆదేశాల్లో స్సష్టం చేసింది.
ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి భూ సర్వేలు పూర్తయ్యాయి, ప్యాకేజీ-1, ప్యాకేజీ-2లుగా విభజించి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో దానికి పర్యావరణ అనుమతులు లేవన్న ఎన్‌జీటీ.. ఆ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయాలని స్పష్టం చేసింది.
ఈ పరిణామం నేపథ్యంలో, ప్రాజెక్టు భవితవ్యం పర్యావరణ అనుమతులపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్‌జీటీ ఆదేశాలను పాటిస్తూ, అవసరమైన అనుమతులు పొందే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.