
‘అమృత్‌భారత్’ స్టేషన్లు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రయాణికుల సౌకర్యాలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పెద్దపీట వేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్‌ఎస్) కింద రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి (ఆధునీకరణ) పనులు చేపడుతన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాలుగు స్టేషన్‌లకు అమృత్ భారత్‌స్టేషన్ పథకం కింద నిధులు కేటాయించగా పనులు పురోగతిలో ఉన్నాయి.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అన్నివిధాలుగా ఆధునీకరించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా స్టేషన్ ముఖద్వారాలు, ప్రణాళికబద్ధమైన పార్కింగ్, పాదాచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలతోపాటు అహ్లాదకరమైన అనుభూతి కలిగేందుకు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. స్టేషన్ ఆవరణలో పార్కులను కూడా అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకం కోసం స్టాల్స్ కేటాయించడం, అత్యున్నత ప్లాట్‌ఫారాలు, తగిన ప్లాట్‌ఫారం స్లాటర్‌ల నిర్మాణం, అధిక నాణ్యతగల పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, ఎల్‌ఈడీ ఆధారిత స్టేషన్ నేమ్ బోర్డులు, వెయింటింగ్ హాల్స్ మెరుగుదల తదితర ప్రయాణికుల సదుపాయాలు, సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.
వన్‌స్టేషన్.. వన్‌ప్రొడక్టు కింద రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, గద్వాల, జోగుళాంబ స్టేషన్లలో పురోగతి పనులు