
ఉత్సాహంగా యోగా క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా సీనియర్ యోగా క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు పైబడి క్రీడాకారుల ఎంపికలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ రానున్న రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. 18–21 ఏళ్ల విభాగానికి ఎం.నందిని, జెట్టి.కావేరి, బి.అంకిత, పూజ, శైలజ, 21–25 విభాగానికి బి.స్వప్న, ఎన్.శ్వేత, సాగర్, మధు, ఆకాశ్, 25–30 విభాగానికి ఎం.బాలమణి, 35–45 విభాగానికి కె.వెంకటేశ్‌లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యోగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రాములు, ఆర్.బాల్‌రాజు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, పీడీ రజిని, సీనియర్ క్రీడాకారులు మణికంఠ, సాగర్, బాలమణి పాల్గొన్నారు.
జెన్‌కోలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు
ఆత్మకూర్: ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఆదివారం తెంగాణ జెన్‌కో రాష్ట్రస్థాయి క్యారమ్స్, చెస్ పోటీలను హెచ్‌ఆర్, ఐఆర్ డైరెక్టర్ ఎస్వీ కుమార్ రాజు ప్రారంభించారు. ఆదివారం ఎగువ జూరాలను సందర్శించిన ఆయన విద్యుదుత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు భారీగా వస్తుండడంతో ఉత్పత్తి చేపట్టలేకపోతున్నామని స్థానిక అధికారులు వివరించారు. ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో కొత్తగూడెం థర్మల్ కేంద్రం, శ్రీశైలం, జూరాల, భద్రాద్రి, విద్యుత్ సౌధ, యాదాద్రి, పులిచింతల ప్రాజెక్టులకు చెందిన 60 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారన్నారు. పోటీలు మరో మూడు రోజులపాటు కొనసాగుతాయని, అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు శ్రీధర్, సురేష్ పాల్గొన్నారు.
యువతి అదృశ్యం:
కేసు నమోదు
నాగర్‌కర్నూల్ క్రైం: యువతి అదృశ్యంపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన నాగలక్ష్మి ఈ నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకి లభ్యం కాలేదు. దీంతో ఆదివారం బాధిత కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.