
జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో
ఽదరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 1.34లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 12 క్రస్ట్‌గేట్లను ఎత్తి 1.19 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 27వేల క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 48 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 500 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 200 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా విద్యుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ జూరాలలో ఐదు యూనిట్ల ద్వారా 169.364 మిలియన్ యూనిట్లు, దిగువ జూరాలలో ఆరు యూనిట్ల ద్వారా 201.175 మిలియన్ యూనిట్లు కలిపి మొత్తం 370.539 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టామన్నారు.
సుంకేసులకు భారీగా వరద
రాజోళి: సుంకేసుల డ్యాంకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. సోమవారం 97 వేల క్యూసెక్కులు వరద వస్తున్నట్లు దాటినట్లు అధికారులు తెలిపారు. దీంతో నదీ తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజోళి మండల అధికారులు సూచించారు. 17 గేట్లను మీటర్ మేర తెరిచి 94,445 క్యూసెక్కులను దిగువకు వదిలారు. కేసీ కెనాల్‌కు 1,847 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేంద్ర పేర్కొన్నారు.
1.34లక్షల క్యూసెక్కుల వరద
12 క్రస్ట్‌గేట్ల ఎత్తివేత
జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి