
స్కూల్ బస్సు కింద పడి వ్యక్తి దుర్మరణం
గట్టు: మండలంలోని బల్గెర గ్రామంలో సోమవారం ఉదయం స్కూల్ బస్సు కింద పడి బల్గెర గ్రామానికి చెందిన బజారన్న అలియస్ ముక్కెరన్న(60) మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. బల్గెర గ్రామానికి చెందిన బజారన్న అలియాస్ ముక్కెరన్న ఉదయం గ్రామంలోని శ్రీదిగంబరస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. బస్టాప్ సమీపంలోని టీ స్టాల్ నుంచి రోడ్డు అవతల ఉన్న ఇంటికి వెళ్తున్న క్రమంలో అయిజలోని ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులతో ఎక్కించుకుని అయిజకు వెళ్తున్న క్రమంలో మూల మలుపు దగ్గర బజారన్న అలియాస్ ముక్కెరన్నను ఢీ కొట్టింది. దీంతో బజారన్న కాళ్లపై నుంచి ముందు టైర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన అయిజకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బజారన్న మృతి చెందినట్లుగా వైద్యులు నిర్దారించారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలున్నారు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు పరమేష్‌నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లేష్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత, స్టేట్ కన్జ్యూమర్ ఫెడరేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, మాజీ సర్పంచు బల్గెర నారాయణరెడ్డిలు గద్వాల ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

స్కూల్ బస్సు కింద పడి వ్యక్తి దుర్మరణం

స్కూల్ బస్సు కింద పడి వ్యక్తి దుర్మరణం