
వాహనదారుడి జేబుకు చిల్లు..!
నిబంధనలు
ఏం చెబుతున్నాయి..
సుప్రీంకోర్టుతో పాటు రోడ్డు రవాణా కమిషనర్ విడుదల చేసిన జీవో ప్రకారం.. ప్రతి వాహనదారుడు జాతీయ రహదారితో పాటు ఇతర రోడ్డు మార్గాలలో అతివేగంగా వాహనం నడపరాదు. ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పక పాటించాలి. లారీలతో పాటు, ఇతర ప్రైవేట్ వాహనాలు అధిక లోడ్‌తో రాకపోకలు సాగించవద్దు. లారీ డ్రైవర్స్ ప్రయాణికులను ఎక్కించుకొని రహదారిపై ప్రయాణం చేస్తే వారిపై కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. మద్యం సేవించి వాహనం నడపరాదు. ఒకవేళ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కోర్టు ఎదుట హాజరుపరచడంతో పాటు వారం నుంచి 30రోజుల వరకు జైలు శిక్ష పడుతుందని నిబంధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా వాహనాలు నడుపుతూ ఫోన్ మాట్లాడినా, డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు తీసుకొని వాహనాలు నడిపినా సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నుంచి ఆరు నెలల పాటు రద్దు చేయడం, వారిపై కేసులతో పాటు జైలు శిక్ష పడటం జరుగుతుంది.
మహబూబ్‌నగర్ క్రైం: ప్రభుత్వం రవాణా శాఖకు సంబంధించిన నూతన వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫీజులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్ జారీ, పర్మిట్స్, ఇతర లావాదేవీలకు సంబంధించి సర్వీస్ ఛార్జీలు భారీగా పెంచింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని వాహనదారుల జేబులకు భారీ స్థాయిలో చిల్లు పడనుంది. గతంలో ఉన్న ఫీజులతో పొలిస్తే ప్రస్తుతం రెండు రెట్లు ఎక్కువ పెంచడం జరిగింది. పెంచిన సర్వీస్ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏడు ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు డ్రైవింగ్ లైసెన్స్‌లు 200 జారీ కాగా నూతన వాహనాల రిజిస్ట్రేషన్స్ 250వరకు అవుతున్నాయి. దీంతో పాటు ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ జారీ, పరిమిట్స్, ఇతర రిజిస్ట్రేషన్స్ కలిపి 600అవుతున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తోంది. ప్రస్తుతం పెంచిన సర్వీస్ ఛార్జీల వల్ల ఆర్టీఏ కార్యాలయాల నుంచి ఆదాయం మరింత రెట్టింపు కానుంది.
8 ఏళ్ల తర్వాత పెంపు
రాష్ట్ర రవాణా శాఖలో 2017 మే 6న సర్వీస్ ఛార్జీలు పెంచుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ సర్వీస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి చెల్లించే సర్వీస్ ఛార్జీలు పెంచడం వల్ల ఎలాంటి రిజిస్ట్రేషన్ అయిన లైసెన్స్ పొందాలన్నా ప్రస్తుతం ఉన్న ఫీజుల కంటే అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇక ద్విచక్ర వాహనాల్లో బైక్ మాడల్ ధర బట్టి సర్వీస్ ఛార్జీలలో మార్పులు ఉంటాయి. అదేవిధంగా కార్లలో కూడా వాటి ధరల ప్రకారం సర్వీస్ ఛార్జీలు పెరుగుతుంటాయి. ప్రస్తుతం ఉన్న ఛార్జీలతో పొలిస్తే కొత్తగా ఛార్జీలు రెట్టింపు అయ్యాయి.
పెంచిన ఛార్జీలు
అమల్లోకి వచ్చాయి..
పెంచిన సర్వీస్ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 2017 తర్వాత ఇప్పుడు పెంచడం జరిగింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్స్‌తో పాటు లైసెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్ ఇలా అన్నింటిపై ఛార్జీలు పెరిగాయి. వాహనదారులు పెరిగిన సర్వీస్ ఛార్జీల ప్రకారం రవాణా సేవలు పొందాల్సి ఉంటుంది.
– కిషన్, డీటీసీ ఉమ్మడి జిల్లా
సర్వీస్ ఛార్జీల వివరాలిలా..
రవాణా శాఖలో భారీగా పెరిగిన సర్వీస్ ఛార్జీలు
సోమవారం నుంచి అమల్లోకి..
ఉమ్మడి జిల్లాలో నిత్యం 250రిజిస్ట్రేషన్స్, 200 డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ

వాహనదారుడి జేబుకు చిల్లు..!