
బాధితులకు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పరామర్శ
పాలమూరు: కోయిలకొండ మండలం కోత్లాబాద్ గ్రామ శివారులో ఈనెల 26న గొర్రెల కాపరి మైబన్న, రైతులు సత్యనారాయణరెడ్డి, చెన్నారెడ్డిపై చిరుత దాడి చేయడంతో వారికి జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిరుతదాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని సోమవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారని మంగళవారం డిశ్చార్జ్ చేస్తామని సూపరింటెండెంట్ ఎమ్మెల్యేకు వివరించారు.
గాయపడిన వ్యక్తిని పరామర్శిస్తున్న
ఎమ్మెల్యే పర్ణికారెడ్డి