మహిళాకూలీతో అంగన్‌వాడీ నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

మహిళాకూలీతో అంగన్‌వాడీ నిర్వహణ

Nov 15 2023 1:12 AM | Updated on Nov 15 2023 7:31 AM

- - Sakshi

కంచన్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలను వారిస్తున్న మహిళా కూలీ

మహమ్మదాబాద్‌: మహమ్మదాబాద్‌ మండలంలోని కంచన్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం ఓ మహిళా కూలీ టీచర్‌ అవతారమెత్తారు. కేంద్రంలో టీచర్‌, ఆయా లేకపోవడంతో ఓ కూలీని పెట్టి కేంద్రం నిర్వహణ కొనసాగించారు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా, మహిళా కూలీ బెత్తం చేతబట్టుకుని పిల్లలను వారించడాన్ని చూశారు. కూలీతో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగా.. అంగన్‌వాడీ కేంద్రంలో కూలీని పెట్టలేదని, పక్క అంగన్‌వాడీ కేంద్రానికి ఇన్‌చార్జ్‌ ఇచ్చినట్లు సూపర్‌వైజర్‌ మల్లమ్మ తెలిపారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement