మేము తరతరాలుగా కురుమూర్తిస్వామిని మా ఇంటి ఇలవేల్పుగా కొలుస్తాం. జాతరకు పది రోజుల ముందే ఇంటికి సున్నాలు వేయించి, వాకిళ్లు ముస్తాబు చేస్తాం. పంట చేతికొచ్చే సమయం కాబట్టి, ఆ ఆనందాన్ని మా ఆడపడుచులు, సుదూర బంధువులతో పంచుకుంటాం. మా ఇంట్లో జాతర నెల రోజుల పాటు కనీసం పది, పదిహేను మంది బంధువులు ఎప్పుడూ ఉంటారు. వారందరికీ స్వయంగా బొగ్గులపై కాల్చిన మాంసం వండి పెట్టడం మాకు ఎంతో తృప్తినిస్తుంది. ఇంతమంది ఇంటికి వచ్చి ఆప్యాయంగా భోజనం చేసి వెళ్తుంటే, ఆ కురుమూర్తి స్వామే మా ఇంటికి వచ్చి ఆశీర్వదించినంత సంతోషంగా ఉంటుంది.
– బుడ్డన్న, రైతు, అమ్మాపురం


