కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు మా ప్రాంతానికి గర్వకారణం. జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కొండకు అతి సమీపంలో ఉండే అమ్మాపురం, చిన్నచింతకుంట గ్రామాల యువకులమంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి భక్తులకు సేవలు అందిస్తాం. ఎండలో వచ్చే భక్తులకు మంచినీటి ప్యాకెట్లు అందించడం, వృద్ధులు కొండ ఎక్కేందుకు సహాయం చేయడం, పోలీసులతో కలిసి ట్రాఫిక్ నియంత్రించడం వంటి పనులను స్వచ్ఛందంగా చేస్తాం. మా ఊరి జాతరకు వచ్చిన ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదన్నదే మా అందరి ఆశయం. ఈ సేవ మాకు ఎంతో ఆత్మ తృప్తిని ఇస్తుంది.
– భాస్కరాచారి, అమ్మాపురం


