62 సర్కారు బడుల్లో ప్రత్యేక లైబ్రరీలు | - | Sakshi
Sakshi News home page

62 సర్కారు బడుల్లో ప్రత్యేక లైబ్రరీలు

Nov 13 2026 4:23 AM | Updated on Nov 13 2026 4:23 AM

ఉమ్మడి జిల్లాలో లైబ్రరీల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలు

నిర్వహణపైనే అసలు సవాల్‌..

● ఒక్కో పాఠశాలకు రూ.15 వేల చొప్పున రూ.9.30 లక్షల విడుదల

● పుస్తకాలతో పాటు న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్ల కొనుగోలుకు నిధులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచడంతో పాటు విజ్ఞానాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 62 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.9.30 లక్షలను విడుదల చేసింది. ఈ నిధులతో లైబ్రరీలకు అవసరమైన బెంచీలు, కుర్చీలు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. లైబ్రరీల నిర్వహణకు ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున కేటాయించనుంది. ఈ నిధులతో విద్యార్థుల వయసు, తరగతులకు అనుగుణంగా కథల పుస్తకాలు, విజ్ఞాన సంబంధిత పుస్తకాలు, మ్యాగజైన్లు, దినపత్రికలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు. కమిటీ నిర్ణయం మేరకు నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.

గతంలోనూ అనేక ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడంతో పుస్తకాలు బీరువాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన లైబ్రరీలైనా విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే పుస్తక పఠనంపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement