అన్నదాతకు ఆర్థిక ఊరట | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ఆర్థిక ఊరట

Nov 13 2026 4:23 AM | Updated on Nov 13 2026 4:23 AM

రూ.653 కోట్ల రుణాలు..

–8లో u

నర్వ: జిల్లాలోని అన్నింటిని కరువు మండలాలుగా ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకు తీసుకున్న పంట రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్ర భుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరిగి రు ణాలు పొందడంపై రైతుల్లో ఆశలు చిగురించాయి. నిబంధనల ప్రకారం సీజన్‌లో తీసుకున్న పంట రుణాలు గడువులోగా చెల్లిస్తే వడ్డీ ఉండదు. ప్రస్తు తం ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడి తగ్గిపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం కష్టమవుతోంది.ప్రభుత్వం ప్రకటించిన కరు వు మండలాల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను పునర్వ్యవస్థీకరణకు కార్యాచరణ రూపొదించాలని కలెక్టర్‌ బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను రీ షెడ్యూ ల్‌, పునర్వ్యవస్థీకరణ చేయడంతో తాత్కాలిక ఊర ట మినహా ప్రయోజనం ఉండదని, మరింత భారం పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.

పునర్వ్యవస్థీకరణ జరిగితే.. పునర్వ్యవస్థీకరణ అంటే తీసుకున్న పంట రుణం తిరిగి చెల్లించే గడు వును పొడిగించడం, వాయిదాల సంఖ్యను పెంచడం, కొంతకాలం చెల్లింపు విరామం(మారటోరియం) ఇవ్వడం. ఉదాహరణకు ఒక రైతు రూ.లక్ష రుణం తీసుకుంటే బ్యాంకు దాన్ని మూడేళ్ల కాలానికి వాయిదాల్లో చెల్లించేలా నిబంధనలు సడలిస్తారు. దీనిపై ఆర్‌బీఐ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో సాగు ఇలా..

జిల్లాలోని 252 రెవెన్యూ గ్రామాల పరిధిలో 4,37, 865 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వాణిజ్య పంట అయిన పత్తి సుమారు 2 లక్షల ఎకరాలు ఉండగా.. తర్వాతి స్థానాల్లో వరి, కంది తదితర పంటలున్నాయి.

కొత్త రుణాలు తీసుకునేందుకు రైతులకు అవకాశం

ఎల్‌నినో ప్రభావంతో

కరువు జిల్లాగా ప్రకటన

పంటరుణ పునర్వ్యవస్థీకరణకు ఆదేశాలు

పాత రుణాల చెల్లింపునకు

ఐదేళ్ల వెసులుబాటు

జిల్లాలో 1,71,098 మంది

రైతులకు ప్రయోజనం

ఎల్‌నినో కారణంగా జిల్లాలోని మొత్తం 13 మండలాలను కరువు మండలాలుగా ప్రభు త్వం గుర్తించింది. ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం భారీగా పెంచినా ఆ మొత్తం రైతులకు చేరితేనే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. లక్ష్యం భారీగా పెంచిన బ్యాంకర్లు రుణ మంజూరులో జాప్యం చేస్తున్నాయి. జిల్లాలో 1.71 లక్షల మంది రైతులు ఉండగా.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 47,469 మంది రైతులు రూ.653 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో దీర్ఘకాలిక, సూక్ష్మ, ఇతర రుణాలు సైతం ఉన్నట్లు బ్యాంకర్ల నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement