పోలీస్‌స్టేషన్‌లో సీమంతం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌లో సీమంతం

Nov 13 2026 4:23 AM | Updated on Nov 13 2026 4:23 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించే పోలీసులు కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడం చాలా అరుదు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ఒత్తిళ్ల మధ్య పోలీసులు ఒకరికొకరు కుటుంబసభ్యుల్లా ఉంటూ ఆప్యాయతను పంచుకుంటారనడానికి గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జరిగిన కార్యక్రమం నిదర్శనం. మహిళా కానిస్టేబుల్‌ శిరీష ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఈ సందర్భంగా గురువారం పోలీస్‌స్టేషన్‌లో సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహిళా ఎస్‌ఐ గాయత్రి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది సాంప్రదాయబద్దంగా సీమంతం నిర్వహించారు. కుటుంబ సభ్యుల మాదిరిగా పూలు, చీర, పండ్లు అందజేసి దీవించారు.

కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షలు

నారాయణపేట ఎడ్యుకేషన్‌: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు జిల్లాకేంద్రంలోని వివేకానంద పార్కు ఎదుట చేపట్టిన రిలే దీక్షలు గురువారం 31వ రోజుకు చేరాయి. ఉద్యోగులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు భిక్షపతి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సే వలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగు ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామా ల నుంచి పట్టణాల వరకు ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడంలో నిరంతరం పని చేస్తున్నామని.. అయినప్పటికీ తమకు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత, న్యాయమైన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం అధ్యక్షుడు ప్రసాద్‌, ప్రధానకార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి రాఘవేందర్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

బాదేపల్లి మార్కెట్‌లో వరికి రికార్డు ధర

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం వరి ధాన్యానికి రికార్డు ధర లభించింది. వివిధ ప్రాంతాల నుంచి 9,645 బస్తాల ధాన్యం వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.3,910, కనిష్టంగా రూ.2,511 ధర పలికింది. మార్కెట్‌ యార్డు చరిత్రలో ధాన్యానికి ఇప్పటి వరకు ఈస్థాయిలో ధర రాలేదని మార్కెట్‌ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 1,332 బస్తాల మొక్కజొన్న రాగా గరిష్టంగా రూ.3,216 కనిష్టంగా రూ.2, 901, వేరుశనగ రూ.8106 ధరలు పలికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement