నారాయణపేట ఎడ్యుకేషన్: ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని.. అధికసంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.
చందనాదీప్తికి డీఐజీగా అదనపు బాధ్యతలు
మహబూబ్‌నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 డీ ఐజీగా అదనపు బాధ్యతలను 2012 బ్యాచ్‌కు చెందిన జి.చందనాదీప్తి కి ప్రభుత్వం అప్పగించింది. ఫ్యూచర్ సిటీ కమిషరేట్ అడ్మిన్ అండ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రెగ్యులర్ పోస్టుతోపాటు జోగుళాంబ జోన్–7 డీఐజీగా ఆమెకు అదనపు బాధ్యత లు అప్పగించారు. గతంలో డీఐజీగా పనిచేసిన ఎల్‌ఎస్ చౌహాన్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆ తర్వాత ఇన్‌చార్జి డీఐజీ బాధ్యతలను మల్టీజోన్–2 ఐజీ షానవాజ్‌ఖాసీంకు ఇవ్వగా.. ఇ ప్పుడు మళ్లీ రెగ్యులర్ అధికారికి కాకుండా అద నపు బాధ్యతలే అప్పగించడం గమనార్హం. అయితే ఉమ్మడి జిల్లాలో ఎస్పీల పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన డీఐజీ పోస్టు రెగ్యులర్ లేకపోవడంతో పోలీస్ శాఖ బాస్‌లపై దృష్టి లేకుండా పోతుంది. అలాగే హెడ్‌కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ వరకు చేయాల్సిన బదిలీల అంశంతోపాటు ఇతర ఫైళ్లపై సంతకాల కోసం జిల్లాల నుంచి సిబ్బంది హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది.
కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లాలో కురుమూర్తిస్వామి జాతరకు ప్రత్యేక బస్సులు నడపాల ని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు రీజియన్ పరిధిలోని ఐదు డిపోల నుంచి మొత్తం 123 బస్సు సర్వీసులు నడపనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15న మొదటి రోజు నాగర్‌కర్నూల్ డిపో నుంచి 10, మహబూబ్‌నగర్ నుంచి 8, కొల్లాపూర్, వనపర్తి నుంచి 4 చొప్పున, నారాయణపేట నుంచి 3 ఇలా 29 బస్సులను ఏర్పాటు చేశారు. సోమవారం ఉద్దాల మహోత్సవం ఉండడంతో 16వ తేదీన వనపర్తి డిపో నుంచి 17, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ నుంచి 15 చొప్పున, కొల్లాపూర్ నుంచి 9, నారాయణపేట నుంచి ఏడు, మొత్తం 63 బస్సులు నడపనున్నారు. అలాగే 17వ తేదీన మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ డిపోల నుంచి 8 చొప్పున, కొల్లాపూర్ నుంచి 4, నారాయణపేట నుంచి 3 ఇలా 31 బస్సులు నడుస్తాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పి.సంతోష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


