ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
బయ్యారం: మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ.. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టి మిల్లులకు తరలించాలని సూచించారు. ఆయన వెంట ఏఈఓ ఫయాజ్, నిర్వాహకులు గణేశ్, జనార్దన్ రెడ్డి ఉన్నారు.
12న జాబ్ మేళా
మహబూబాబాద్: జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరామ్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. మానుకోట, కేసముద్రం, గూడూరు, మరిపెడ, సీరోలు, కుర వి, గార్ల, బయ్యారం, చిన్నగూడూరు మండలాల్లో పనిచేయడానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉండి 20నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులన్నారు. ఈనెల 12న ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యాలయంలో జాబ్‌మేళా ఉంటుందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
డోర్నకల్ ఎఫ్‌ఆర్వోగా విజయలక్ష్మి
డోర్నకల్: డోర్నకల్ ఇన్‌చార్జ్ ఎఫ్‌ఆర్వోగా విజయలక్ష్మి శుక్రవారం నియమితులయ్యారు. ఇక్కడ పని చేసిన ఎఫ్‌ఆర్వో రేణుక సండ్ర కర్ర అక్రమ రవాణా వ్యవహారంలో ఇటీవల సస్పె ండ్ అయ్యారు. ఆమె స్థానంలో తొర్రూరు ఎఫ్ ఆర్వో విజయలక్ష్మి నియమితులయ్యారు.
ట్రెస్సా జిల్లా అధ్యక్షుడిగా సునీల్
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెస్సా) జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సునీల్, ప్రధాన కార్యదర్శిగా ఫిరోజ్, అసోసియేట్ అధ్యక్షుడిగా రాజేశ్వర్‌రావు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, బాలకిషన్, కోశాధికారిగా కృష్ణ ప్రసాద్‌తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
అంగన్‌వాడీ సెంటర్లనుపరిశుభ్రంగా ఉంచాలి
డోర్నకల్: అంగన్‌వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుతూ పిల్లల భద్రతపై శ్రద్ధ వహించాలని డీడబ్ల్యూఓ సబిత కోరారు. మండలంలోని అమ్మపాలెం రైతువేదిక భవనంలో శుక్రవారం నిర్వహించిన డోర్నకల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు తెరిచి ఉంచాలని, టీచర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ప్రీ స్కూల్ కార్యక్రమాలు, పోషణ సేవలు నిర్వహించాలని, బీఎల్‌ఓలుగా నియమితులైన వారు తహసీల్దార్ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. సీడీపీఓ లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.


