కార్డుతో కట్టడి..
యూరియా అధిక నిల్వలకు అవకాశం లేకుండా చర్యలు
పంటల నమోదు,
ఎరువుల
యాజమాన్యం కార్డు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో వానాకాలం సీజన్ నుంచి యూరియా బస్తాల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు కాస్త ఊరట కలగనుంది. అవసరానికి మించి కొనుగోలు చేసే వారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డులతో రైతులు సాగుచేసిన పంటల ఆధారంగా.. వ్యవసాయశాఖ సూచన మేరకు యాసంగిలో యూరియా బస్తాలు అందజేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
రైతులకు కార్డుల పంపిణీ..
పంటల సాగుకు అనుగుణంగా యూరియా పంపిణీ చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా తయారు చేసిన కార్డులు పంపిణీ చేస్తున్నారు. పంటల నమోదు, ఎరువుల యాజమాన్యం పేరుతో ముద్రించిన 2.24లక్షల కార్డులను జిల్లా వ్యాప్తంగా రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. స్థానికంగా ఏఈఓలు నమోదు చేసిన పంటల వివరాలతో పాటు.. విత్తనాలు కొనుగోలు చేసిన కూపన్ ఆధారంగా ఎరువులు ఇస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఎకరానికి వరికి మూడు బస్తాలు, మిర్చికి ఆరు బస్తాలు, మొక్కజొన్నకు ఐదు బస్తాల చొప్పున అందజేస్తున్నారు. అయితే ఈ బస్తాలు మూడు విడతలుగా రైతులకు అందిస్తారు. యూరియా తీసుకునే సమయంలో కార్డును చూపించి.. ఏ పంటలు ఎన్ని ఎకరాలు వేశారు. ఎన్ని బస్తాలు ఇవ్వాల్సి ఉంటుంది.. ఇప్పుడెన్ని ఇస్తున్నాం.. ఇంకా ఈ సీజన్‌లో ఎన్ని బస్తాలు ఇవ్వాలి అనే వివరాలు పొందుపరుస్తున్నారు.
పంటల నమోదు, ఎరువుల
యాజమాన్యం కార్డుల పంపిణీ
విత్తనాల కొనుగోలు బిల్లు ఆధారంగా కేటాయింపు
వరికి మూడు, మక్కకు ఐదు, మిర్చికి ఆరు బస్తాలు
మూడు విడతలుగా రైతులకు పంపిణీ
కౌలు
రైతులకు
ఇబ్బంది..
పంటల సాగు వివరాల ప్రకారం యూరియా అందజేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు కౌలు రైతుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని పలువురు కౌలు రైతులు చెబుతున్నారు. అయితే పంటల నమోదు, ఓటీపీలు భూమి యజమానికి వెళ్తున్నాయని, దీంతో తమ పంటలు సక్రమంగా నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా పంపిణీలో ఏఈఓల రికార్డులు కూడా ప్రమాణికంగా తీసుకొని క్షేత్రస్థాయిలో పంటల నమోదు చేయాలని, అప్పుడు అక్కడ ఉన్న కౌలు రైతులను గుర్తించి వారికి యూరియా అందజేయాలని కోరుతున్నారు.
కార్డుతో కట్టడి..


