యూరియా పంపిణీ పరిశీలన
కురవి: మండల కేంద్రంలోని ఎఫ్‌ఎస్‌సీఎస్ కేంద్రం వద్ద రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. గ్రామాల వారీగా యూరియా పంపిణీ చేస్తున్నారని రైతులు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు యూరియా రాలేదని ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రతీరోజు సొసైటీల ద్వారా, ఏఆర్‌ఎస్‌కేల ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ సరిత, ఏఓ గుంటక నరసింహరావు, ఎంపీడీఓ వీరబాబు, సొసైటీ బాధ్యుడు జితేందర్, ఏఈఓలు పాల్గొన్నారు.


