యూరియా కొరత లేదు
జిల్లాలో యాసంగి సీజన్‌లో రైతులు సాగుచేసిన పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. ఈ సీజన్‌లో 59వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 112 ప్రభుత్వ ఆగ్రోస్, రైతు సేవా సమితి, పీఏసీఎస్ మొదలైన వాటితోపాటు 439 ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులకు యూరియా సరఫరా చేశాం. రైతుకు నచ్చిన చోటుకు వెళ్లి యూరియా తీసుకునే అవకాశం కల్పించాం. కౌలు రైతుల విషయంలో కూడా ఏఈఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పంటల సాగును పరిశీలించి యూరియా అందించేలా చర్యలు తీసుకుంటారు. – బి. సరిత, డీఏఓ


