కబడ్డీ కోచ్‌గా వరప్రసాద్
నర్సింహులపేట: హరియాణా రాష్ట్రంలోని పానిపట్‌లో జనవరి 12 నుంచి 16వ తేదీవరకు జరిగే 69వ అండర్–19 కబడ్డీ బాలుర క్రీడోత్సవాల్లో పాల్గొంటున్న తెలంగాణ జట్టుకు కోచ్‌గా మండలంలోని కొమ్ములవంచకు చెందిన తాళ్ల వరప్రసాద్ ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు కోచ్‌గా ఎంపిక చేసినందుకు రాష్ట్ర ఎస్జీఎఫ్ బాధ్యులకు వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. వరప్రసాద్ ఎంపిక కావడంపై క్రీడాకారులు, బంధువులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
1.780 కేజీల గంజాయి పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామ శివారు పెద్ద చెరువు కట్ట వద్ద ముగ్గురు యువకుల నుంచి 1.780 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ సర్వయ్య శనివారం రాత్రి తెలిపారు. మహబూబాబాద్ రూరల్ పోలీసులు కంబాలపల్లి గ్రామంలో తనిఖీలు చేస్తుండగా చెరువు కట్ట సమీపంలో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. వారి వద్ద కిలో 780 గ్రాముల (రూ.85 వేల విలువ గల) గంజాయి లభ్యంకాగా ఆ గంజాయిని కలిగి ఉన్న హైదరాబాద్‌కు చెందిన కందుకూరి కేతన్ అలియాస్ బంటి, మానుకోట గిరిప్రసాద్ నగర్ కాలనీకి చెందిన నల్ల వరుణ్, జమాండ్లపల్లి గ్రామ శివారు చంద్రు తండాకు చెందిన బానోతు సునీల్ గా గుర్తించామని తెలిపారు. ముగ్గురు యువకులు తరచూ గంజాయి సేవించడంతోపాటు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. రూరల్ ఎస్సై దీపిక ఫిర్యాదు మేరకు ఏఎస్సై వెంకన్న కేసు నమోదు చేయగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. మూడు సెల్ ఫోన్లు సీజ్ చేశామని, మానుకోట ధర్మన్న కాలనీకి చెందిన బోడ వంశీ, బోడ కార్తీక్ పరారీలో ఉన్నారని సీఐ వెల్లడించారు.
మేడారం భక్తులతో రామప్ప కళకళ
వెంకటాపురం(ఎం) : మేడారం భక్తులతో రామప్ప ఆలయం కళకళ లాడుతోంది. సమ్మక్క–సారలమ్మల దర్శనానికి వెళ్లే భక్తులు రామప్ప ఆలయాన్ని చూసేందుకు వస్తుండడంతో రామప్ప కిక్కిరిసిపోతుంది. దీంతో పూజారులు గర్భగుడిలోకి భక్తులను అనుమతించకుండా ప్రదానం ద్వారం వద్దనే తీర్థప్రసాదాలు అందించి పంపిస్తున్నారు. వీకెండ్ కావడంతో శనివారం వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. రామప్ప గార్డెన్‌లో ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. రామప్ప సరస్సు వద్దకు వెళ్లి బోటింగ్ చేశారు.
రామప్పను సందర్శించిన జిల్లా జడ్జి
మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని మహబూబాబాద్ జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. రామప్ప శిల్పకళా సంపదను గైడ్ వెంకటేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. శిల్పకళా సంపద బాగుందని కొనియాడారు.
వనదేవతలకు ముందస్తు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో కొలువైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో షవర్ల కింద స్నా నాలు ఆచరించి, వనదేవతల గద్దెల వద్ద పసు పు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్ల ను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.
కేయూ అథ్లెటిక్స్ జట్లు ఎంపిక
కేయూ క్యాంపస్: బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్‌లో ఈనెల 10నుంచి ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగనున్న ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సి టీ అథ్లెటిక్స్ టోర్నమెంట్‌కు కాకతీయ యూని వర్సిటీ అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ జట్లు పాల్గొనబోతున్నాయని స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య శనివారం తెలిపారు. పురుషుల జట్టులో ఎ.గౌతమ్, బి.రోషన్, డి.వివేక్‌చంద్ర, ఎస్.గోపిచంద్, సీహెచ్.వినయ్, ఆర్.అభినయ్, ఎం.అఖిల్, వి.గణేష్ ఉన్నారు. మహిళా జట్టులో ఎ.మైథిలి, బి.శృతి, సీహెచ్.కీర్తన ఉన్నారు. జట్లకు కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ ఎన్.సుమన్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు.


