ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి
మహబూబాబాద్ రూరల్ : సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది తమ స్వగ్రామాలకు ప్రయాణాలు చేస్తుంటారని, ఈ సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండుగలకు ఊరెళ్ళేవారు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ శనివారం సూచించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేశామని తెలిపారు.
ఎస్పీ శబరీష్
సంక్రాంతి నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు


