క్రీడల్లో గెలుపోటములు సహజం
ఏటూరునాగారం : క్రీడల్లో గెలుపు, ఓటమి సహజమని క్రీడాకారులు ఓటమిని రేపటి గెలుపుకోసం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కొమురం భీమ్ మినీ స్టేడియంలో మూడ్రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు పీఓ చిత్రమిశ్రా షీల్డులు అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు.
వాలీబాల్ అండర్–14 విభాగంలో..
● బాలుర విభాగంలో ఉట్నూర్–1 జట్టు మొదటి స్థానం సాధించింది. భద్రాచలం రెండో స్థానంలో ఏటూరునాగారం జట్టు మూడో స్థానంలో నిలిచింది.
బాలికల విభాగంలో..
● భద్రాచలం జట్టు ప్రథమ, ఏటూరునాగారం జట్టు ద్వితీయ, ఉట్నూర్–1 మూడో స్థానం కై వసం చేసుకున్నారు.
వాలీబాల్ అండర్–17..
● బాలుర విభాగంలో భద్రాచలం జట్టు మొదటి స్థానం, ఏటూరునాగారం రెండో స్థానం, ప్లేన్ ఏరియా ఐ మూడోస్థానంలో విజయం సాధించింది.
బాలికల విభాగంలో..
● ఉట్నూర్ జట్టు ప్రథమం, భద్రాచలం జట్టు ద్వితీయ, ఏటూరునాగారం తృతీయ స్థానంలో నిలిచింది.
ఖోఖో అండర్–17 బాలుర విభాగంలో..
● ఉట్నూర్–1జట్టు ప్రథమ స్థానం, ఏటూరునాగారం ద్వితీయ స్థానం, భద్రాచలం మూడో స్థానాన్ని కై వసం చేసుకుంది.
బాలికల విభాగంలో..
● ఉట్నూర్ జట్టు–2 ప్రథమ స్థానం, భద్రాచలం ద్వితీయ, ఏటూరునాగారం తృతీయ స్థానంలో విజయం సాధించారు.
కబడ్డీ అండర్–17 బాలుర..
● భద్రాచలం జట్టు మొదటి స్థానం, ప్లేన్ ఏరియా జట్టు–1 రెండో స్థానం, ఏటూరునాగారం మూడో స్థానంలో నిలిచింది.
బాలికల విభాగంలో..
● భద్రాచలం జట్టు ప్రథమ, ప్లేన్ ఏరియా జట్టు–2 ద్వితీయ, ఏటూరునాగారం జట్టు తృతీయ స్థానంలో నిలిచింది.
కబడ్డీ అండర్–14 బాలుర..
● ప్లేన్ ఏరియా జట్టు మొదటి స్థానం, ఉట్నూర్ జట్టు–1 రెండో స్థానం, ఏటూరునాగారం జట్టు మూడో స్థానంలో విజయం సాధించింది.
బాలికల విభాగంలో..
● భద్రాచలం జట్టు ప్రథమ, ఏటూరునాగారం జట్టు ద్వితీయ, ఉట్నూర్–1 తృతీయ స్థానంలో విజయం సాధించింది.
● అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్, వంద మీటర్ల పరుగు పందెం, అండర్ –17 బాలికల విభాగంలో చెస్ తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్, దేశిరాం , ఏటీడీఓ, ఏసీఎంఓ, స్పోర్ట్స్ అధికారులు, భీమ్లా, పార్ధసారధి, రమేష్, కిష్టు, కొమ్మాలు, ఆదినారాయణ, శ్యామలత, వివిధ పాఠశాలల పీజీహెచ్‌ఎంలు, కన్వీనర్లు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా
ముగిసిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడాపోటీలు
క్రీడల్లో గెలుపోటములు సహజం


