మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచించారు. శుక్రవారం పార్టీ నేతలతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఎత్తు బంగారం మొక్కుగా చెల్లించి, జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. జాతర సమీపిస్తున్న తరుణంలో ఇంకా అభివృద్ధి పనులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికి 50శాతం పనులు కూడా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పనులు వేగవంతంగా చేపట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని, రెండో పంట సాగు చేయకుండా నష్టపోతున్న రైతులు పరిహారం అందించాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును స్థానిక నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరేందర్, గౌతంరావు, జిల్లా ఇన్‌చార్జ్ నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బలరాం, కార్యదర్శి భర్త పురం నరేష్, సమ్మక్క పూజారి సిద్దబోయిన సురేందర్, వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు


