వెంటాడిన మృత్యువు..
● రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి,
నలుగురికి తీవ్రగాయాలు
ఏటూరునాగారం : సంక్రాంతి పండుగకు ఇంటి వచ్చిన కుమార్తెలతో కలిసి కొద్ద్ది నిమిషాల్లో థియేటర్‌లో సంతోషంగా సినిమా చూడాల్సిన తండ్రి, కూతుర్లను మృత్యువు వెంటాడి విడదీసింది. శుక్రవారం మండలంలోని రోహిర్ పంచాయతీ పరిధి 163 జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో కారును టోషన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజేడు మండలానికి చెందిన కాకర్లపుడి వీరభద్రరాజు (వినోద్) (49) అక్కడికక్కడే మృతిచెందా డు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన తన కుమార్తెలు మేఘన, మధురిమ, తమ్ముడు మనోజ్, మరో బంధువు వత్సవాయి బుచ్చి గోపాలరాజు వర్మతో కలిసి వీరభద్రరాజు టీఎస్ ఎఫ్ 2799 నంబరు గల కారులో ఏటూరునాగారం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏటూరునాగారం వైపు నుంచి వస్తున్న ఏపీ 12 ఎల్ 2715 నంబరుగల టోషన్ వాహన డ్రై వర్ జాకీర్ హుస్సేన్ మద్యం మత్తులో అజాగ్రతగా నడిపి రాంగ్‌రూట్‌లో ఎదురుగా వచ్చి వీరి కారును ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న వీరభద్రరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని మే ఘన, మధురిమతోపాటు మనోజ్, బుచ్చి గోపాలవర్మ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే 108 వాహనంలో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మృతుడి తమ్ముడు మనోజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ట్లు సమాచారం. అప్పటి వరకు ఎంతో ప్రేమగా మాట్లాడిన తమ తండ్రి కళ్లముందే ప్రాణం కోల్పో యి విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి కుమార్తెలు రోదించిన తీరు చూపరులను కలిచి వేసింది. వి షయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలా న్ని పరిశీలించి మృతుడి తమ్ముడు వెంకట సత్యనరసింహరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.


