కక్షిదారు వద్దకే జడ్జి..
● మానవత్వం చాటిన న్యాయమూర్తి
ధీరజ్‌కుమార్
తొర్రూరు: ఓ సివిల్ కేసులో కోర్టుకు వచ్చిన బాధితురాలు నడవలేనిస్థితిలో ఉండడంతో న్యాయమూర్తి ఆమె దగ్గరికే వచ్చారు. ఈ ఘటన తొర్రూరులో గురువారం జరిగింది. ఓ సివిల్ కేసులో కక్షిదారురాలిగా ఉన్న పద్మ అనే మహిళ తొర్రూరు సివిల్ కోర్టుకు వచ్చింది. ఆమె తన కాళ్లు పనిచేయక అనారోగ్యంతో ఉండి కోర్టు భవనంపైకి వెళ్లే పరిస్థితి లేదు. సమాచారం తెలుసుకున్న జడ్జి ధీరజ్‌కుమార్ ఆమె వద్దకే వచ్చి కేసు వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే కేసును పరిష్కరించాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.


