ఉత్తమ ఫలితాలు సాధించాలి
● డీఈఓ రాజేశ్వర్ రావు
నర్సింహులపేట: పదో తరగతి విద్యార్థులు ఇష్టపడి చదవి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ రాజేశ్వర్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని హైస్కూల్, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలను సందర్శించి తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి, ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వి ద్యార్థులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీ టుగా ఎక్కువ మార్కులు వచ్చేలా బోధించడంతో పాటు పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. హైస్కూల్, కేజీబీవీలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. కేజీబీవీలో పిల్లలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రామ్మోహన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, మందుల శ్రీరాములు, ప్రిన్స్‌పాల్ స్వప్న, సీఆర్‌పీ జక్కి రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


