బస్సుల కండీషన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
హన్మకొండ: మేడారం జాతరలో బస్సుల వైఫల్యం లేకుండా కండీషన్‌పై మెయింటెనెన్స్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ సూచించారు. బుధవారం వరంగల్ ములుగు రోడ్‌లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ రీజియన్ల ట్రాఫిక్, మెయింటెనెన్స్ ఇన్‌చార్జ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తులకు రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. వాహనాలు బ్రేక్ డౌన్ అయితే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో బస్సులు ఫెయిల్ కాకుండా మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. బ్రేక్‌డౌన్ కాకుండా బస్సులను సిద్ధం చేయాలన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ మేనేజర్ కేశరాజు భాను కిరణ్, ఏటీఎం ఎం.మల్లేశయ్య, డిపో మేనేజర్ రవి చంద్ర, పర్సనల్ ఆఫీసర్ పి.సైదులు, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.రవీందర్, తదితరులు పాల్గొన్నారు
భూ తగాదా..
అన్నను చంపిన తమ్ముడు
వర్ధన్నపేట: భూ తగాదా నేపథ్యంలో అన్నను చంపిన తమ్ముడిని అరెస్ట్ చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. బుధవారం వర్ధన్నపేట ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రా మానికి చెందిన కొండ వీరస్వామి(62)కు తన తమ్ముడు వెంకన్నతో 30 ఏళ్లుగా భూ తగాదా జరుగుతోంది. ఈ క్రమంలో ఈనెల 5న వీరస్వామి తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. అక్కడ తన మరో తమ్ముడు లక్ష్మయ్య పొలంలో ఉన్నాడు. స మీపంలోని మడుగులో చేపలు పడదామని లక్ష్మ య్యకు చెప్పి వీరస్వామి ముందు వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో వీరస్వామి చిన్న త మ్ముడు, నిందితుడు వెంకన్న తన అన్న ఒంటరిగా ఉండడం గమనించి ఇదే అదనుగా భావించాడు. అక్కడే ఉన్న పారతో వీరస్వామిని దారుణంగా కొట్టి చంపి పరారయ్యాడు. మరో సోదరుడు లక్ష్మ య్య కుండ పట్టుకుని మడుగు వద్దకు వచ్చి చూడగా వీరస్వామి కనిపించలేదు. దీంతో అక్కడే వెతుకుతున్న క్రమంలో మడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన వెంకన్నను బుధవారం రాయపర్తి బస్టాండ్ వద్ద పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.కాగా, 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్న సీఐ శ్రీనివాసరావు, రాయపర్తి ఎస్సై రాజేందర్‌ను సిబ్బందిని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ నర్సయ్య అభినందించారు.
● ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్
నిందితుడి అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన ఏసీపీ నర్సయ్య
బస్సుల కండీషన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి


