గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఏటూరునాగారం: కొమురం భీంను స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో బుధవారం అండర్ –14, 17 విభాగాల్లో 6వ రాష్ట్రస్థాయి (భద్రాద్రి కొత్తగూడెం, ఊట్నూరు, మన్ననూరు, ఏటూరునాగారం ఐటీడీఏలు, 10 ప్లేన్ ఏరియాలు) గిరిజన క్రీడలను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఆడాలన్నారు. గిరిజన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి వ్యాయామ ఉపాధ్యాయులు, ఐటీడీఏ పాలన అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అందుకు కావాల్సిన సహకారం అందిస్తానని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా, మానసికంగా ధృడంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా మాట్లాడుతూ ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన క్రీడాకారులు ఈ పోటీల్లో రాణించి పేరు తీసుకురావాలన్నారు. కాగా, అండర్– 14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో జోన్ –2(ఏటూరునాగారం)కు చెందిన చరణ్ మొదటి స్థానం, జోన్ –1(భద్రాచలం)కు చెందిన సోను రెండో, ధీరజ్ మూడో స్థానం సాధించి బహుమతులు అందుకున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌తోపాటు ఇతర క్రీడలూ ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్, డీటీడీఓలు, ఏటీడీఓలు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఏటూరునాగారంలో 6వ రాష్ట్ర స్థాయి
గిరిజన క్రీడలు ప్రారంభం
గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి


