మహబూబాబాద్ రూరల్: రైతులు పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేసి అధిక దిగుబడితో పాటు మంచి లాభాలు పొందాలని వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ జి.వీరన్న, మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎస్.మాలతి అన్నారు. మానుకోట జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం మల్యాల కేవీకే ఆధ్వర్యంలో అధిక సాంద్రత పత్తిసాగుపై బుధవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. రైతులు అధిక సాంద్రత పత్తిసాగు చేయాలన్నారు. ఎంపిక చేసుకోవాల్సిన విత్తనాలు, విత్తే పద్ధతి, విత్తే దూరం, ఎరువులు, నీటి వినియోగం, దిగుబడి తర్వాత వేసుకోదగిన పంటల గురించి వివరించారు. జిల్లాలోని పత్తి విస్తీర్ణం, అధిక సాంద్రత పద్దతిలో పత్తి విస్తీర్ణం పెరగడానికి తీసుకుంటున్న చర్యలపై డీఏఓ విజయ నిర్మల వివరించారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్‌ఎఆర్‌ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని, మల్యాల కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ కిశోర్ కుమార్, ఏడీఏలు శ్రీనివాసరావు, విజయ్ చంద్ర, ఏఓ తిరుపతిరెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.


