గట్టమ్మ వద్ద దుకాణాల వేలం
ములుగు రూరల్: మేడారం జాతర సందర్భంగా ఆది దేవత గట్టమ్మ వద్ద భక్తుల సౌకర్యార్థం దుకాణాల ఏర్పాటుకు దేవాదాయశాఖ అధికారులు బుధవారం వేలం పాటలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వేలం పాటలకు వ్యాపారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేలం పాటల్లో కొబ్బరికాయ దుకాణం రూ.12.80లక్షలు, పసుపు–కుంకుమ రూ. 4.20 లక్షలు, కూల్‌డ్రింక్స్ రూ.1.90 లక్షలు, మొక్కజొన్న కంకులు రూ. 20 వేలు, బెల్లం రూ.75 వేలు, హోటల్ రూ. 20 వేలు, జనరల్ షాపు రూ.25 వేలు, పండ్ల షాపు రూ.13 వేలు, కాఫీ షాపు రూ.12 వేలు, ఐస్‌క్రీమ్ రూ.45 వేలు, చెరుకు రసం, కొబ్బరి బొండాలు రూ.13 వేలకు హెచ్చుగా పాట నిర్ణయించినట్లు తెలిపారు. పరిశీలకులు అనిల్‌కుమార్, దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


