అప్రమత్తతతో సైబర్ నేరాల కట్టడి
● డీఎస్పీ తిరుపతిరావు
కురవి: అప్రమత్తతతో సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఆన్‌లైన్ పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోన్, బెట్టింగ్ యాప్స్ వాడడం వల్ల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌చేయాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై గండ్రాతి సతీష్, సైబర్ క్రైం ఎస్‌ఐ కరుణాకర్ పాల్గొన్నారు.


