చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్: వినియోగదారులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, తమ హక్కులు, బాధ్యతలపై కూడా అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. బుధవారం జాతీయ వినియోగదారుల దినోత్సవా న్ని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు చట్టాలపై విస్తృతంగా ప్రచారం చేసి చైతన్యపర్చాలన్నారు. అన్యాయం జరిగితే న్యాయం కోసం జాతీయ వినియోగదారుల సంస్థ పని చేస్తుందన్నారు. డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా త్వరితగతిన కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీఎస్‌ఓ రమేశ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.


