క్షేత్రస్థ్ధాయిలో సర్వే నిర్వహించాలి
నెహ్రూసెంటర్: ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించి కుష్ఠువ్యాధి నియంత్రణకు కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ జాన్‌బాబు, సెంట్రల్ అబ్జర్వర్ జయంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు సబ్ సెంటర్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చర్మంపై మచ్చలు ఉన్నట్లయితే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సర్వే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్, డీపీఎంఓ వాలియా, వైద్యాధికారి మౌనిక తదితరులు పాల్గొన్నారు.


