మహబూబాబాద్
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
రైతులకు సహకరించాలి
మహబూబాబాద్ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు సహకరించి సకాలంలో కొనుగోళ్లు చేపట్టాలని జెడ్పీ సీఈఓ, మండల ప్రత్యేక అధికారి పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. కొనుగోళ్ల తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకువస్తే తేమశాతం ఆధారంగా కొనుగోళ్లు చేసేందుకు వీలుంటుందన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా రైతులకు అవగాహన కల్పించి సకాలంలో కొనుగోళ్లు చేపట్టి, కాంటాలు త్వరగా పూర్తిచేసి, బస్తాలను మిల్లులకు తరలించాలని సూచించారు. లారీలు, బస్తాలు, ఇతర రవాణా సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మల్యాల ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శి జగన్ ఉన్నారు.
మహబూబాబాద్
మహబూబాబాద్


