తప్పని యూరియా కష్టాలు
● క్యూకట్టిన రైతులు
● నిరాశపరిచిన ప్రత్యేక యాప్
మహబూబాబాద్ రూరల్ : యూరియా కష్టాలు రైతులను వదిలిపెట్టడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయం వద్ద మంగళవారం తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు ఎదురుచూశారు. వానాకాలం పంటల సాగు ముగించుకుని యాసంగి పంటల సాగు కోసం రైతులు పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రైతులు మొక్కజొన్న, మిర్చి సాగు చేయడంతో పాటు యాసంగి వరి నార్లు పోసుకుని వరి పంట సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మూడు పంటలకు కూడా యూరియా తప్పనిసరి అని భావించిన రైతులు ఆ బస్తాల కోసం రెండు మూడు రోజుల క్రితం వరకు ప్రత్యేక యాప్ వస్తుందని ఎదురు చూశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ కోసం నిర్ణయించిన ప్రత్యేక యాప్ కార్యకలాపాలు కొద్దిరోజుల వరకు నిలిపివేస్తున్నారని చెప్పడంతో యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న, మిరప సాగు చేసిన రైతులు యూరియా కోసం మానుకోటలోని పీఏసీఎస్ వద్దకు తెల్లవారుజామునే చేరుకోగా క్యూలో వేచిఉండడం కనిపించింది. అదేవిధంగా శనిగపురం గ్రామంలోని యూ రియా విక్రయ కేంద్రం వద్ద కూడా రైతులు బస్తాల కోసం క్యూలో వేచిఉండగా స్టాకు ఉన్నంత మేరకు బస్తాలను సంబంధిత అధికారులు, సిబ్బంది పోలీ సు బందోబస్తు మధ్య రైతులకు అందజేసి మిగిలిన రైతులను తర్వాత రమ్మని చెప్పి పంపించారు. మా నుకోట పీఏసీఎస్ పరిధిలో 444బస్తాల యూ రియా, శనిగపురం విక్రయ కేంద్రం పరిధిలో 666బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశామని మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, సొసైటీ సీఈఓ ప్రమోద్ తెలిపారు.


