ప్రైవేట్ భవనం పరిశీలన
కురవి: మండల కేంద్రంలో ప్రైవేట్ భవనాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో ఎస్సీ బాలికల వసతిగృహం నిర్వహణ కొనసాగుతోంది. హాస్టల్‌ను వేరే చోటుకు మార్చేందుకు గతంలో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల కొనసాగిన భవనాన్ని ఆయన పరిశీలించా రు. అనంతరం ఆర్డీఓ కృష్ణవేణి, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ విజయ, ఆర్‌ఐ రవికుమార్ భవనాన్ని పరిశీలించి, సౌకర్యాలు తెలుసుకున్నారు.
నేడు లక్ష తులసి అర్చన
మహబూబాబాద్ రూరల్: ధనుర్మాసవ్రత మహోత్సవాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీరామ ఆలయంలో శ్రీవెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసి అర్చన బుధవారం జరగనుందని ఆలయ ప్రధాన అర్చకుడు ఎంవీ.కృష్ణప్రసాద్ మంగళవారం తెలిపారు. ఉదయం 9గంటలకు ప్రారంభంకానున్న లక్ష తులసి అర్చన పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. విష్ణు సహస్ర నామాలు చదివే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు.
డిపో అభివృద్ధికి పాటుపడాలి
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఉద్యోగులు, సిబ్బంది పాటుపడాలని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలోమన్ సూచించారు. డిపోలోని సెక్షన్లను పరిశీలించి మంగళవారం ఉద్యోగులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మేడారం జాతరకు ఆర్టీసీ మరింత సేవలు అందించేలా సిద్ధం కావాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ వి.కల్యాణి, డిపో సూపరింటెండెంట్ శ్రీమన్నారాయణ, ఎంఎఫ్ పాపిరెడ్డి, రాములు, ఏడీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.
దాతలు ముందుకు రావాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ఆధ్వర్యంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వీ వాటర్ ప్లాంట్‌ను డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత దేశం, సొంత గ్రామం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం యూత్ సభ్యులను సన్మానించి అభినందించారు. ఏసీజీఈ మందుల శ్రీరాములు, పాఠశాల హెచ్‌ఎం సిరి నాయక్, ఉపాధ్యాయులు వాసుదేవ్, రవీందర్‌నాయక్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
వనదేవతలకు
భక్తుల మొక్కులు
ఎస్‌ఎతాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను మంగళవారం భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చా రు. జంపన్నవాగులోని స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన నల్లాల కింద జల్లు స్నానాలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. యాటలను మొక్కుగా సమర్పించారు. అనంతరం భక్తులు మేడారం ప్రాంతంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనా లు ఆరగించారు. అలాగే మేడారం పనుల పరి శీలనకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, సీఎం ముఖ్య సలహాదారువేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రుల పర్యటన, భక్తుల రద్దీతో మేడారంలో సందడి నెలకొంది.
ప్రైవేట్ భవనం పరిశీలన
ప్రైవేట్ భవనం పరిశీలన


