ఉద్యోగులూ.. ఉద్యమంలో పాల్గొనాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులూ.. ఉద్యమంలో పాల్గొనాలి

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

కార్యాలయాలకు వెళ్లి కోరుతున్న ఏపీజేఏసీ అమరావతి నాయకులు

నల్లబ్యాడ్జీలు ధరించే విధులకు హాజరవుతున్న ఉద్యోగులు

కర్నూలు(సెంట్రల్‌): ఉద్యమంలో ఉద్యోగులు పాల్గొనాలని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ వి.గిరికుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఉద్యమంలో భాగంగా మూడో రోజు ఏపీజేఏసీ అమరావతి నాయ కులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఉద్యోగులను కోరారు. కలెక్టరేట్‌, జెడ్పీలో ఉద్యమానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరిస్తూ కరపత్రాలు, నల్లబ్యాడ్జీలను అందజేశారు. ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని, అప్పుడే ప్రభుత్వం మెడలు వచ్చి డిమాండ్ల సాధనకు మార్గం సుగమనం అవుతుందన్నారు. ఇదిలా ఉండగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

27 నెలలు గడిచినా

ఒక్క హామీ నెరవేర్చలేదు

ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌ వి.గిరికుమార్‌రెడ్డి మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి సిద్ధమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైన 12వ పీఆర్‌సీ కమిషనర్‌ను తొలగించడం అన్యాయమన్నారు. ఉద్యోగులకు ఐఆర్‌ 30 శాతం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను కూడా వెంటనే ఇవ్వాలన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులపై రాజకీయ ముద్రలు వేయడం అన్యాయమన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.40 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీపీఎస్‌ స్థానంలో ఓపీఎస్‌ను మాత్రమే అంగీకరిస్తామని, జీపీఎస్‌ను కూడా ఒప్పుకునేది లేదన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగులరైజేషన్‌ చేయాలని, వారికి సమాన పనికి సమాన వేతనం కింద కనీస వేతనం రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలని కోరుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.వెంకటరాజు, నాయకులు ధనుంజయరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement