ఇటీవల కాలంలో ఆత్మహత్యకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వైద్యులను సంప్రదించి చికిత్స అందేలా చేయాలి. అక్కడి వైద్యులు మందులతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి సాధారణ జీవితం గడిపేలా చేస్తారు.
–డాక్టర్ చైతన్యకుమార్ నేరెళ్ల, మానసిక వైద్యులు, జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం
ఆత్మహత్యలపై మాట్లాడకూడదని ఇప్పటికీ అపోహలు ఉన్నాయి. కానీ దీని గురించి చర్చిస్తే చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చు. ఇటీవల కాలంలో బెట్టింగ్‌కు అలవాటు పడి ఎక్కువ మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెద్దలు ఈ విషయమై చర్చించి పరిష్కారం కనుగొనాలి.
–డాక్టర్ కె.నాగిరెడ్డి,
సైకియాట్రిస్ట్, కర్నూలు


