● ఆడబిడ్డను వదిలేసిన తల్లిదండ్రులు
ఆలూరు: ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామ సమీపంలోని బ్రహ్మయ్య దేవాలయం వద్ద అప్పడప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలేసి వెళ్లిన సంఘటన బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో జరిగింది. దేవాలయం ముందు కళ్లు తెరవని, అప్పుడప్పుడే పుట్టిన శిశువును వదిలేసిన విషయాన్ని దేవాలయం సమీపంలోని కొందరు గుర్తించారు. ఈ విషయాన్ని కమ్మరచేడు గ్రామస్తులకు దేవాలయ నిర్వాహకులు సమాచారం చేరవేశారు. కమ్మరచేడు గ్రామానికి చెందిన ఖాశీం అనే వ్యక్తి పసికందును ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు పోలీసుల సమక్షంలో ఆదోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన పసిబిడ్డకు ఆసుపత్రిలో చికిత్సలు చేస్తున్నారు.


