వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే

Sep 10 2026 1:33 AM | Updated on Sep 10 2026 1:33 AM

‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా

అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి,

జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

కల్లూరు: ప్రజల తరఫున నిలబడి వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి పిలుపునిచ్చారు. కల్లూరు అర్బన్‌ ముజఫర్‌నగర్‌ ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో బుధవారం సాయంత్రం పాణ్యం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ ఎన్నికల ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనే విధంగా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామాల్లో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుని వారి పక్షాన నిలబడి నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు ఏం మాట్లాడినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అనుమానాస్పద అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, రైతుల భూములు తీసుకుంటే ఆకుటుంబాల పిల్లలకు, ఆ గ్రామంలోని చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి పేరుతో స్థానిక ప్రజలకు అన్యాయం జరగకూడదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్‌ గుండం సూర్య ప్రకాష్‌రెడ్డి, జెడ్పీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి, నియోజకవర్గంలోని నాయకులు గాజుల శ్వేతారెడ్డి, అక్కిమి హనుమంతురెడ్డి, మీదివేముల ప్రభాకర్‌రెడ్డి, దండు లక్ష్మీకాంతరెడ్డి, నాగలక్ష్మీరెడ్డి, నరసింహులు, నారాయణరెడ్డి, శివశంకర్‌రెడ్డి, సూర్యానారాయణరెడ్డి, శ్రీథర్‌రెడ్డి, రమణారెడ్డి, శివారెడ్డి, సుమంత్‌, శ్రీకాంత్‌రెడ్డి, తిరుపాల్‌, రామలక్ష్మణుడు, కరుణాకర్‌రెడ్డి, యువరాజ్‌, సత్యంరెడ్డి, , ఎంపీటీసలు, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement