కర్నూలు(సెంట్రల్): మట్టితో చేసిన వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయాధికా పీవీ కిషోర్ రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరు జి.నరసింహులు, లయన్స్ క్లబ్ కార్యదర్శి రాయపాటి శ్రీనివాస్ సూచించారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పీసీబీ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏక్యాంపు మాంటిస్సోరి స్కూల్, కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేశవరెడ్డి స్కూల్, శ్రీజ స్కూల్, దుపాడులోని అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు మట్టి వినాయకులను పూజించాలని కోరుతూ అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులను పర్యావరణహిత పద్ధతులను అవలంబించేలా మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం పీసీబీ కార్యాలయంలో బహుమతులను అందజేస్తామని అధికారులు తెలిపారు.


