పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రచురణ | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రచురణ

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రచురణ

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాలను ప్రచురించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఆగస్టు 23వ తేది నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలపై 26వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించామన్నారు. జిల్లా కలెక్టర్‌ అనుమతితో 31న అన్ని గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాలను ప్రచరించామన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ కార్యాలయాల నోటీసు బోర్డుల్లోను, ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు ముఖ్యమైన కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement