నకిలీ మద్యంను అరికట్టండి | - | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యంను అరికట్టండి

Aug 26 2026 1:36 AM | Updated on Aug 26 2026 1:36 AM

కర్నూలు: స్థానిక ఎన్నికల దృష్ట్యా నకిలీ మద్యం, పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి రాకుండా నిరంతర నిఘా ఉంచి దాడులు చేపట్టాలని ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ కమిషనర్‌ చామకూరి శ్రీధర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవ్‌ శర్మ జిల్లాలోని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా వారు ఎకై ్సజ్‌ కాంప్లెక్స్‌లోని కెమికల్‌ ఎగ్జామినేషన్‌ ల్యాబ్‌ను, నూతనంగా ఏర్పాటు చేసిన పరికరాల పనితీరును పరిశీలించారు. అనంతరం తెలంగాణ సరిహద్దులోని పంచలింగాల చెక్‌పోస్టును తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కర్నూలు, పత్తికొండ, డోన్‌, బనగానపల్లె స్టేషన్ల పరిధిలో నాటుసారాను పూర్తిగా నిర్మూలించాలని ఆదేశించారు. మద్యం షాపుల్లో విధిగా తనిఖీలు చేపట్టి శ్యాంపిల్‌ తీయాలని సూచించారు. కర్నూలు డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి, అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు, కర్నూలు డీపీఈఓ సుధీర్‌బాబు, డిపో మేనేజర్‌ శ్రీధర్‌ రావు తదితరులు స్థానిక ఎకై ్సజ్‌ కార్యాలయ ఆవరణంలో ఉన్నతాధికారులకు ఘనంగా స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement