కర్నూలు(సెంట్రల్): కర్నూలు సాక్షి ఫొటోగ్రాఫర్ వడ్డె శ్రీనివాసులు జాతీయ స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డును అందుకున్నారు. మంగళవారం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్(ఏపీపీజేఏ) జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫొటో కాంపిటీషన్‌లో కర్నూలు సాక్షి ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్న వడ్డె శ్రీనివాసులు అచీవ్‌మెంట్ విభాగంలో ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా నిలిచారు. ముఖ్య అతిథులుగా హాజరైన సీఆర్ మీడియా ఆఫ్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, సీఈఓ ఆర్.మల్లికార్జున రావు, ఐజేయూ జనరల్ సెక్రటరీ డి.సోమసుందర్‌లు ఆయనకు అవార్డు ప్రదానం చేశారు.


